మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Jatayu Kruta Sri Rama Stotram – శ్రీ రామ స్తుతిః (జటాయు కృతం)


జటాయురువాచ |
అగణితగుణమప్రమేయమాద్యం
సకలజగత్స్థితిసంయమాదిహేతుమ్ |
ఉపరమపరమం పరమాత్మభూతం
సతతమహం ప్రణతోఽస్మి రామచంద్రమ్ || 1 ||

నిరవధిసుఖమిందిరాకటాక్షం
క్షపితసురేంద్రచతుర్ముఖాదిదుఃఖమ్ |
నరవరమనిశం నతోఽస్మి రామం
వరదమహం వరచాపబాణహస్తమ్ || 2 ||

త్రిభువనకమనీయరూపమీడ్యం
రవిశతభాసురమీహితప్రదానమ్ |
శరణదమనిశం సురాగమూలే
కృతనిలయం రఘునందనం ప్రపద్యే || 3 ||

భవవిపినదవాగ్నినామధేయం
భవముఖదైవతదైవతం దయాలుమ్ |
దనుజపతిసహస్రకోటినాశం
రవితనయాసదృశం హరిం ప్రపద్యే || 4 ||

అవిరతభవభావనాతిదూరం
భవవిముఖైర్మునిభిః సదైవ దృశ్యమ్ |
భవజలధిసుతారణాంఘ్రిపోతం
శరణమహం రఘునందనం ప్రపద్యే || 5 ||

గిరిశగిరిసుతామనోనివాసం
గిరివరధారిణమీహితాభిరామమ్ |
సురవరదనుజేంద్రసేవితాంఘ్రిం
సురవరదం రఘునాయకం ప్రపద్యే || 6 ||

పరధనపరదారవర్జితానాం
పరగుణభూతిషు తుష్టమానసానామ్ |
పరహితనిరతాత్మనాం సుసేవ్యం
రఘువరమంబుజలోచనం ప్రపద్యే || 7 ||

స్మితరుచిరవికాసితాననాబ్జ-
-మతిసులభం సురరాజనీలనీలమ్ |
సితజలరుహచారునేత్రశోభం
రఘుపతిమీశగురోర్గురుం ప్రపద్యే || 8 ||

హరికమలజశంభురూపభేదా-
-త్త్వమిహ విభాసి గుణత్రయానువృత్తః |
రవిరివ జలపూరితోదపాత్రే-
-ష్వమరపతిస్తుతిపాత్రమీశమీడే || 9 ||

రతిపతిశతకోటిసుందరాంగం
శతపథగోచరభావనావిదూరమ్ |
యతిపతిహృదయే సదా విభాతం
రఘుపతిమార్తిహరం ప్రభుం ప్రపద్యే || 10 ||

ఇత్యేవం స్తువతస్తస్య ప్రసన్నోఽభూద్రఘూత్తమః |
ఉవాచ గచ్ఛ భద్రం తే మమ విష్ణోః పరం పదమ్ || 11 ||

శృణోతి య ఇదం స్తోత్రం లిఖేద్వా నియతః పఠేత్ |
స యాతి మమ సారూప్యం మరణే మత్ స్మృతిం లభేత్ || 12 ||

ఇతి రాఘవభాషితం తదా
శ్రుతవాన్ హర్షసమాకులో ద్విజః ||
రఘునందనసామ్యమాస్థితః
ప్రయయౌ బ్రహ్మసుపూజితం పదమ్ || 13 ||

ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే అరణ్యకాండే అష్టమసర్గే జటాయు కృత శ్రీ రామ స్తోత్రమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.